చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్
రాయచోటి ప్రతినిధి మేజర్ న్యూస్: రవాణా,యువజన,క్రీడల శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి ఎంపీడీవో కార్యాలయంలో చెన్నముక్కపల్లి-2 ఎంపీటీసీ అభ్యర్థిగా బాలిపోగు వేణుగోపాల్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా బాలిపోగు వేణుగోపాల్ మాట్లాడుతూ, తనకు ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకంతో కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గ్రామంలోని కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
రషీద్ రాయచోటి ప్రతినిధి.
..