andhrapradesh
ప్రొద్దుటూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఆందోళన.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
ప్రొద్దుటూరు / కడప జిల్లా: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు పోలీసుల భద్రత కల్పించి, నామినేషన్లు వేసేందుకు తగిన అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. పోలీసులు తమను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా డీఎస్పీ బాలస్వామిరెడ్డి తమపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసుల తీరుపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రొద్దుటూరులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.