BREAKING
బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి ఎల్‌నినోపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం - తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాతృ మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి... * జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు అయోడిన్ ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించాలి... * జిల్లా వైశాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * గుండవోలు నుంచి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు.... మోతె పాఠశాల గ్రంథాలయం ఆదర్శనీయం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఉన్నత విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం - ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం ప్రచారంలో మొల్లి హేమంత్ కు బ్రహ్మరథం రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా ఆర్మూర్ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్ పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్ సేవ శూన్యం.. కలెక్షన్లలో ముందంజ: కూటమి అభ్యర్థిపై మద్దాల ఫైర్ మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా అధ్యక్షులు కె. కె రాజు

మందమర్రి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

Select Suryaa Now
మందమర్రి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

సూర్య , మందమర్రి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్యాచ్‌అప్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీకాలు పొందని పిల్లలందరికీ టీకాలు వేయించాలని ఆదేశించారు. కుష్ఠు వ్యాధి నివారణ సర్వేను ముమ్మరం చేయడంతో పాటు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.