BREAKING
జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు పది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి -- నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -- నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అంతర్జాతీయ కరాటే పోటీల్లో కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల విద్యార్థికి పసిడి పతకం బోడవారిపల్లి ఎంపీటీసీ బరిలో జనసేన అభ్యర్థి చిరంజీవి ఎల్‌నినోపై ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలం - తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాతృ మరణాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి... * జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు - సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు అయోడిన్ ప్రాముఖ్యంపై ప్రజలకు వివరించాలి... * జిల్లా వైశాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు * గుండవోలు నుంచి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా తైదుపాటి నరసింహులు.... మోతె పాఠశాల గ్రంథాలయం ఆదర్శనీయం - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ ఎన్నికల జోరు పెంచిన కోయిలాడ నవ్య ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఉన్నత విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం - ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం ప్రచారంలో మొల్లి హేమంత్ కు బ్రహ్మరథం రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా ఆర్మూర్ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్

నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి

Select Suryaa Now
నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి
పెద్దవడుగూరు / అనంతపురం జిల్లా: తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరులో రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ప్రత్యర్థులు రాళ్లదాడికి పాల్పడ్డారు.

పోలీసుల జీపులో నామినేషన్‌ కేంద్రానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు మార్గమధ్యలో అడ్డుకున్నారు. నామినేషన్‌ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు గుమిగూడి ఈ దాడికి దిగడంతో ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. ఈ రాళ్లదాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా బలగాలను మోహరించారు.