సబితమ్మకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
సబితమ్మకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
జల్ పల్లి: దసరా పండుగను పురస్కరించుకొని, జల్ పల్లి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సూర్ రెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు యంజాల జనార్దన్, యంజాల అర్జున్, సూర్రెడ్డి గోపాల్ రెడ్డి, సూర్రెడ్డి సత్తిరెడ్డి, పోలమోని నాగేష్ ముదిరాజ్, నవపేట్ ఆంజనేయులు, గుండు నర్సింగ్, సిద్ధార్థ, బాస శంకర్, సయ్యద్ అబ్బాస్ తదితరులు బుధవారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని, క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి, దసరా పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి, సబితమ్మ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ. జల్ పల్లి డివిజన్ పార్టీ నాయకులకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు,జల్ పల్లి ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయదశమి సందర్భంగా చెడుపై మంచి సాధించి, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్,