బెజ్జుర్‌లో ఘనంగా స్వేరో డే వేడుకలు
సూర్య బెజ్జుర్.:కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జుర్ మండల కేంద్రంలో స్వేరో కార్యకర్తలు స్వేరో డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరో జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శ్రీను ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని, వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.అనంతరం మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శ్రీను మాట్లాడుతూ, స్వేరో డే ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో విద్య, ఆరోగ్యం, సమానత్వం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడమే స్వేరోల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, మూఢనమ్మకాలకు దూరంగా ఉండి, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం స్వేరో కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీను మండలం అధ్యక్షులు హరి, జ్ఞానే్సర్ జిల్లా ఆర్గానిజింగ్ సెక్రటరీ, బక్కన మండలం నాయకులు,తదితరులు పాలొగొన్నారు...