కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధులత శ్రీనివాస్ చారికి TUWJ(IJU) నాయకుల ఘన సన్మానం
తాండూరు, మేజర్ న్యూస్: కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన మధులత శ్రీనివాస్ చారిని వికారాబాద్ జిల్లా TUWJ(IJU) నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి సతీమణి మధులత శ్రీనివాస్ చారిని శుక్రవారం తాండూరు పట్టణంలోని ఆమె నివాసంలో జిల్లా జర్నలిస్టు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో TUWJ(IJU) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కుమ్మరి రాఘవేందర్, జిల్లా నాయకులు పి. చుక్కయ్య, ప్రవీణ్ చారి, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.