మెడిసిన్ లో మెరిసిన గిరిజన ముద్దుబిడ్డ బిహారిక
మెడిసిన్ లో మెరిసిన గిరిజన ముద్దుబిడ్డ బిహారిక: తెలంగాణ (మహబూబాబాద్ జిల్లా జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గార్ల, మేజర్ న్యూస్, మెడిసిన్ మెరిసిన గిరిజన ముద్దు బిడ్డ భూక్య బిహారిక. మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల పరిధి మర్రిగూడెం గ్రామ పంచాయతీలోని సరిహద్దు తండాకు చెందిన భూక్య శ్రీను-సుమిత్ర లకు ఇద్దరు కూతుర్లు. భూక్య శ్రీను నాయక్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ (రైటర్) గా విధులు నిర్వహిస్తున్నారు. వారి రెండో కూతురు భూక్య బిహారిక మండల కేంద్రం లోని నిర్మల హైస్కూల్ లో టెన్త్ క్లాస్ పూర్తి చేసి, అత్యధిక మార్కులతో ఉత్తీర్ణు లైనారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మెడికల్ అకాడమీ లో విద్యాభ్యాసం చదివి పాస్ అయినారు. ఆ వెంటనే నీట్ పరీక్షలు వ్రాసి, ఫలితాల్లో విజయఖేతనం ఎగురవేశారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో..తన ప్రతిభ కనబరిచి, కరీంనగర్ లోని "చల్మెడ" ఆనందరావు మెడికల్ కాలేజీలో భూక్య బిహారిక (ఎంబిబిఎస్)లో సీటు సాధించారు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టినప్పటికి బిహారిక తన తల్లి-దండ్రుల కోరికను నెరవేర్చలనే పట్టు దలతో చదివి నేడు మెడిసిన్ లో సీటు సాధించుకున్నారని మండల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంమీద ఈ పరిణామం తెలంగాణ (మహబూబాబాద్ జిల్లా జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.