"సర్వేపల్లి వైకాపాలోకి భారీగా కొనసాగుతున్న వలసలు"
"సర్వేపల్లి వైకాపాలోకి భారీగా కొనసాగుతున్న వలసలు": ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సర్వేపల్లి, మేజర్ న్యూస్ : నెల్లూరులోని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్‌రెడ్డి గారి నివాసంలో తోటపల్లిగూడూరు మండలంలోని కొత్తకోడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కైలాసం రాజా, తదితర 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావల్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన కాకాణిమాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. సోమిరెడ్డి చేష్టలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు, సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ సర్పంచ్‌లు, టిడిపి నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వారందరికీ స్వాగతం పలుకుతున్నామని, పాత నాయకులను, పార్టీలోకి వస్తున్న కొత్త నాయకులను కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు, 2029లో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు అధికార పార్టీ నేతలు అనేక అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలకు పాల్పడుతూ, బెదిరింపులకు గురిచేస్తున్నా బెదరకుండా ధైర్యంగా టిడిపిని వీడి వైయస్సార్సీపి లోకి వచ్చిన గ్రామస్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు రాష్ట్రంలో కీలకమైన, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత అనుకూల వాతావరణం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని , ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దాడులుచేయడం ,అవినీతికి పాల్పడటం, తప్ప అభివృద్ధి జాడే కనిపించడం లేదని, ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లో ఉన్న స్థానిక నాయకులను, కార్యకర్తలను హీనంగా చూడటంతో , వీటిని భరించలేక తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్ముకొని ఎన్నికలు జరిపే పరిస్థితి లో లేదు అని.
మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.