BREAKING
పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి బీసీ-ఏ కేటగిరీ పరిరక్షణకై సమరం - 7% రిజర్వేషన్లు హరించుకుపోతాయని తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఆందోళన.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం కొత్తగూడ లో ఉచిత కంటి వైద్య శిబిరం మందమర్రి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

జోరు వర్షంలోనూ ఆత్మీయ సమావేశాల్లో కోటంరెడ్డి సుజిత, లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి

Select Suryaa Now
జోరు వర్షంలోనూ ఆత్మీయ సమావేశాల్లో కోటంరెడ్డి సుజిత, లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి

జోరు వర్షంలోనూ ఆత్మీయ సమావేశాల్లో కోటంరెడ్డి సుజిత, లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి: ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నెల్లూరు,  మేజర్ న్యూస్ :  నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచార రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. నామినేషన్ల ప్రారంభమైన దగ్గర నుంచి రూరల్ పరిధిలోని 36 డివిజన్ల పరిధిలో ఆత్మీయ సమావేశాల తేదీలను ఖరారు చేసి, ఒక్కో డివిజన్ లలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి తదితరులు ఇప్పటికే అనేక డివిజన్లో ఆత్మీయ సమావేశాలలో పాల్గొని అక్కడ స్థానికులతో మమేకమయ్యారు. గత రెండు సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వ హాయంలో రూరల్ నియోజకవర్గం లో జరిగిన 966 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను స్థానికులకు వివరిస్తున్నారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. స్థానికంగా ఇంకా ఏమైనా రోడ్లు, రహదారులు, కాలువలు అసంపూర్తిగా ఉన్నాయా స్థానికంగా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలతో కలిసిపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తో పాటు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతున్న ఇప్పటికే రూరల్ పరిధిలోని సగం డివిజన్లలో కోటంరెడ్డి కుటుంబం ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో  నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు.

మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.