టీడీపీ జెడ్పిటిసి అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు రూరల్ జడ్పిటిసి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జడ్పీ చైర్మన్ రేసులో ప్రధానంగా ఆయన పేరు వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వంటేరు వేణుగోపాల్ రెడ్డి జెడ్పీ చైర్మన్ కావాలన్న లక్ష్యంతో నెల్లూరు రూరల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి సోదరుల హవా బలంగా ఉండడంతో పాటు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో నెల్లూరు రూరల్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. కోటంరెడ్డి సోదరులు అండదండలతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే కానుంది..