మర్రిపూడి ఎంపీటీసీ బరిలో లక్ష్మీ సుప్రజ..!
మర్రిపూడి ఎంపీటీసీ బరిలో లక్ష్మీ సుప్రజ..!
బాపట్ల మండలం మర్రిపూడి ఎంపీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున కాగిత లక్ష్మీ సుప్రజ గురువారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు ఏజీ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. 28 ఏళ్ల బీటెక్ యువతి ఎన్నికల బరిలో నిలవడంతో మర్రిపూడి రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.