BREAKING
విజేతలకు బహుమతుల పంపిణీ ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ నిరసన క్యాన్సర్ బాధితునికి బిఆర్ఎస్ యువజన విభాగం ఆర్థిక సాయం పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్ డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటేల స్వప్న నామినేషన్ మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శ బ్యానర్లు చింపిన వారిని గుర్తించాలని సీఐ కి ఫిర్యాదు చేసిన సర్పంచ్ సంగం బిట్ 3నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్‌సీపీ నేతలు పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఊట్పల్లిలో అల్లరి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎస్.కె సబిహా షేక్ ప్రచారం ఏతురు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా బి నందిని, ఆర్ స్వప్న ! హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి

గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారంలో ముందుంటున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి

Select Suryaa Now
గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారంలో ముందుంటున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి

చౌడాపూర్, మేజర్ న్యూస్: గ్రామ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా చౌడాపూర్ మండల పరిధిలోని మందిపాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. గ్రామంలో ఎక్కడ సమస్య తలెత్తినా అక్కడికి వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గ్రామంలో మురుగునీటి కాలువలను శుభ్రం చేయించడం, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలను సరిచేయించడం, స్వచ్ఛభారత్ కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.గ్రామంలోని వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పనులు చేయిస్తున్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా పర్యవేక్షిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు.ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపుతూ, గ్రామ అభివృద్ధి మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి పనితీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పేర్కొంటున్నారు.

రిపోర్టర్:కోస్గి విజయ్ కుమార్, చౌడపూర్, వికారాబాద్ జిల్లా.