బ్యానర్లు చింపిన వారిని గుర్తించాలని సీఐ కి ఫిర్యాదు చేసిన సర్పంచ్
ధర్మసాగర్ , మేజర్ న్యూస్, బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పంచ్ గ్రామ పాలకవర్గం సభ్యులు అందరూ కలిసి ఏర్పాటుచేసిన బ్యానర్లను చింపి వేసిన విషయమై ధర్మసాగర్ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియ వారి పాలకవర్గంతో గురువారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధర్మసాగర్ గ్రామంలోని బ్యాంకు వద్ద, దసరా ఉత్సవాల జరిగే రిజర్వాయర్ (చెరువు) వద్ద ఏర్పాటుచేసిన రెండు చోట్ల బ్యానర్లను చింపి వేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ దరఖాస్తు చేశారు. సర్పంచ్ వెంట ఉప సర్పంచ్ కొంతం కొమరమ్మ, వార్డు సభ్యులు కొట్టే .భానుచందర్, గంగారపు శ్యామ్, మహమ్మద్ ముజ్జు, చిలక ప్రతిభ, బొడ్డు రఘు ప్రసాద్ లతో పాటు పుట్ట ప్రదీపు, కులమారి రణధీర్, చిలుక విజయ్, గాదే శ్యాంసుందర్, మాచర్ల ఏలీలతో కూడిన బృందం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఐ స్పందన బాగుందని త్వరలోనే బ్యానర్లు చెప్పిన వ్యక్తులను గుర్తిస్తామని వారికి హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గాని గాని సర్పంచ్ గాని ఎవరిపైనైనా అనుమానం ఉన్నట్లయితే తెలియజేయాల్సిందిగా ఆయన కోరినట్లు చెప్పారు. గ్రామంలో గంజాయి సేవించిన అమ్మిన చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని సిఐ పాలకవర్గానికి హామీ ఇచ్చిండు గా తెలిపారు. సాధ్యమైనంత త్వరలో బ్యానర్లు చింపిన వ్యక్తులను గుర్తించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు
పోర్టర్; కొట్టే పద్మయ్య, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా