పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో రైతు వేదికలో గురువారం పత్తి కొనుగోలపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ అధికారి రమేష్ నాయక్ ,అమరచింత వ్యవసాయ అధికారి అరవింద్ ,వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, రైతులు తదితరులు పాల్గొన్నారు.