కామయ్యపాలెం వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి బోడిక భోగేశ్వరరావు నామినేషన్ దాఖలు.
జీలుగుమిల్లి మండలంలోని కామయ్యపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా బోడిక భోగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిబుచ్చారావు పరిశీలించి స్వీకరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మండల వైసిపి నాయకుల కృషి తన విజయానికి కృషి చేస్తాయని బోడిక భోగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కామయ్యపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ఇకపై ఎంపీటీసీ గా అభివృద్ధి చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలు తనను గెలిపించాలని అభ్యర్థించారు.
రిపోర్టర్: బొంతు రామకృష్ణ ఏలూరు జిల్లా.