BREAKING
పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి 71వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్.... జడ్పీటీసీ/ ఎంపిటిసి నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ క్రికెట్ ఛాంపియన్ వంశీకకు కేటీఆర్ అభినందనలు ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

66వ వార్డులో రూప్ కుమార్, కప్పిర రేవతి ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
66వ వార్డులో రూప్ కుమార్, కప్పిర రేవతి ఇంటింటి ప్రచారం

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలోని 66వ వార్డులో కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్, కార్పొరేటర్ అభ్యర్థి కప్పిర రేవతితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, నెల్లూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. నగరాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు వివరించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని రూప్ కుమార్, కప్పిర రేవతి ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.