BREAKING
భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలి 25వ డివిజన్లో దాట్ల సుడిగాలి ప్రచారం రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా దక్షిణ కొరియా కాలువలో 10 అడుగుల అరుదైన షార్క్ హైడ్రామా: ఎండిన వరి చేను... యువరైతు వినూత్న నిరసన, సాగునీరు, విద్యుత్ అందక మూడు ఎకరాలలో ఎండిన పంట, పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన ఏపీలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు కార్మికుల భద్రతలో నిర్లక్ష్యాన్ని సహించం ఎమ్మెల్యే పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష 21వ డివిజన్ లో వెంకట సాయి ప్రచారహోరు.. రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల జయలక్ష్మి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు 19 కోట్లతో రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నామినేషన్ కేంద్ర వద్ద పోలీసు భద్రతపై పరిశీలన

దసరా సందర్భంగా ఆందోల్‌లో ‘అలయ్ బలయ్’కు ఏర్పాట్లు.

Select Suryaa Now
దసరా సందర్భంగా ఆందోల్‌లో ‘అలయ్ బలయ్’కు ఏర్పాట్లు.

.

సంగారెడ్డి,  ; దసరా పండుగను పురస్కరించుకొని సోదరభావం, ఐక్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే లక్ష్యంతో ఆందోల్ నియోజకవర్గంలో ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది.సుల్తాన్‌పూర్‌లోని తాడ్ దాన్ పల్లి ఎక్స్ రోడ్ సమీపంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. దసరా పండుగ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు ఒకచోట చేరి ఆత్మీయంగా పలకరించుకోవడం, పరస్పర సోదరభావాన్ని పెంపొందించుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆందోల్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి క్యాంపు కార్యాలయం కోరింది.
కార్యక్రమ వివరాలు:తేదీ:అక్టోబర్ 23, 2026, శుక్రవారం సమయం: ఉదయం 11 గంటల నుంచి
వేదిక:ఎంఎస్ ఫంక్షన్ హాల్, తాడ్ దాన్ పల్లి ఎక్స్ రోడ్, సుల్తాన్‌పూర్