21వ డివిజన్ లో వెంకట సాయి ప్రచారహోరు..
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:- అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ లో వెంకట సాయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా డివిజన్ ప్రజల అభిమానాన్ని చూరగొంటు ముందుకు వెళ్తున్నాడు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, తనను ఆదరించి ఆశీర్వదిస్తే సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. డివిజన్లో మెరుగైన పారిశుద్ధ్య వ్యవస్థను నెలకొల్పుతానని, నిత్యం మీ ఇంటి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటానని వెంకట సాయి డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. యువకుడు, విద్యావంతుడు, వివాద రహితుడు కావడంతో డివిజన్ ప్రజలు వెంకట సాయి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తన గ్లాస్ గుర్తుకు, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వెంకట సాయి విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంచుతున్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్