BREAKING
ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి

రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా

Select Suryaa Now
 రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా

ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా

విజయవాడ, మేజర్ న్యూస్:

రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ, మానవత్వానికి ప్రాధాన్యమిస్తున్న గొప్ప నటుడని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ముత్యాలంపాడులోని సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దెందుకూరి మురళీకృష్ణంరాజు కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో బొండా ఉమా పాల్గొని కేక్ కట్ చేసి ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ పాన్ ఇండియా నటుడిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఆపదల సమయంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. తన నటన, కృషి, పట్టుదలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారని కొనియాడారు. ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, దాట్ల రాజేష్ వర్మ, సోమన అనిల్, మనీష్ వర్మ, రాఘవేంద్ర రాజు, అబ్బులు, బోస్, రామకోటయ్య, శ్రీను, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొని ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.