BREAKING
ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ కార్పొరేషన్ ఎన్నికల్లో .. జోరుగా సాగిన పర్వత రెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి

భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరు, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శుక్రవారం మాగుంట లేఔట్ అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల కారణంగా అండర్ బ్రిడ్జిల వద్ద వరద నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని అండర్ బ్రిడ్జిల వద్ద చేరే వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, మోటార్ల సహాయంతో నీటిని తొలగించాలని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా అన్ని అండర్ బ్రిడ్జిల వద్ద ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, సమీపంలోని డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కమిషనర్ పేర్కొన్నారు.