రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల జయలక్ష్మి
రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల జయలక్ష్మి
రాప్తాడు మేజర్ న్యూస్:
రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల శ్రీనివాసులు భార్య గోనిపట్ల జయలక్ష్మిని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి జయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, రాప్తాడు మండల టీడీపీ ఇన్‌ఛార్జి ధర్మవరపు మురళికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని జయలక్ష్మి పేర్కొన్నారు.