BREAKING
విజేతలకు బహుమతుల పంపిణీ ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ నిరసన క్యాన్సర్ బాధితునికి బిఆర్ఎస్ యువజన విభాగం ఆర్థిక సాయం పారిశుద్ధ కార్మికుల భద్రతకు ప్రాధాన్యత-విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు వినియోగించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కే మనోహర్ డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటేల స్వప్న నామినేషన్ మాజీ సర్పంచ్ కొత్త రంగారెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరామర్శ బ్యానర్లు చింపిన వారిని గుర్తించాలని సీఐ కి ఫిర్యాదు చేసిన సర్పంచ్ సంగం బిట్ 3నామినేషన్ల దాఖలుకు వైఎస్సార్‌సీపీ నేతలు పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఊట్పల్లిలో అల్లరి ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎస్.కె సబిహా షేక్ ప్రచారం ఏతురు టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా బి నందిని, ఆర్ స్వప్న ! హరీశ్‌రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి

కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

Select Suryaa Now
కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రంగరాజ్ పాల్గొని పండుగ సాయన్నకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా పండుగ సాయన్న చేసిన పోరాటాలు, ఆయన ధైర్యసాహసాలు, ప్రజల పట్ల చూపిన సేవాభావాన్ని స్మరించుకున్నారు. సమాజం కోసం ఆయన చేసిన కృషి, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పండుగ సాయన్న వంటి చారిత్రక వ్యక్తుల జీవిత చరిత్రను యువతకు తెలియజేయడం ద్వారా సామాజిక చైతన్యం, సమానత్వ భావనలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొని పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించారు.