BREAKING
చిలకలూరిపేటలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: సీఐ రమేష్,ఎస్సై అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా వత్సవాయి జడ్పీటీసీ అభ్యర్థిగా కిలారు విశ్వనాథ్ నామినేషన్.. టీడీపీలో గందరగోళం! జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం.. పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి:..ప్రత్యేక అధికారి హనుమంత రావు. అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. రాయితీపై విత్తనాలు.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలి.. అక్టోబర్ 24న ఎన్నికల శిక్షణ – స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఒకే రోజు నిర్వహించడంపై ఉపాధ్యాయుల్లో గందరగోళం.. నల్లపల్లి విజయ్ భాస్కర్ కరీంనగర్ ఏఎంసీ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం ఇథనాల్ తయారీకి చక్కెరను మళ్లించవద్దు: రాష్ట్రాలకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశాలు.. దేశీయ లభ్యత, ధరల నియంత్రణే లక్ష్యం! ట్రంప్-మోదీ 'గ్రాండ్' ట్రేడ్ డీల్: భారత్ ఎక్కువ రాయితీలు ఇస్తోందా? భారత ప్రయోజనాలు, వాణిజ్య సవాళ్ల సమగ్ర విశ్లేషణ! ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ ఎల్ ని నో ప్రభావం... యాసంగిలో ఆరుతడి పంటలే శ్రేయస్కరం... ఇంకెన్నాళ్లీ పారిశ్రామిక ప్రమాదాలు? కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

గ్రామగ్రామాన మహిళా భజన కమిటీలు ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
గ్రామగ్రామాన మహిళా భజన కమిటీలు ఏర్పాటు చేయాలి

గ్రామగ్రామాన మహిళా భజన కమిటీలు ఏర్పాటు చేయాలి

-మహిళా భజన బృందాలకు ఐడీ కార్డుల పంపిణీ


సిద్దిపేట రూరల్ : గ్రామగ్రామాన మహిళా భజన కమిటీలను ఏర్పాటు చేసి, మహిళలను ఆధ్యాత్మికత వైపు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంగల రాంరెడ్డి పిలుపునిచ్చారు.సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన మూడు మహిళా భజన బృందాలకు తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆయన ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భజన బృందాలు గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.జిల్లాలోని ప్రతి గ్రామంలో మహిళా భజన కమిటీలను ఏర్పాటు చేసి, మహిళా కళాకారులకు గుర్తింపు కల్పించాలన్నారు. భజన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మహిళల్లో ఐక్యతను పెంపొందిస్తూ, జానపద కళలకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో సంఘం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మీరుదొడ్డి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహిళా భజన బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(సూర్య రూరల్, రమేష్)