జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం..
జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం..: ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా టిడిపి పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కంభం విజయరామరెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిల సహకారంతో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఫైనల్ అయ్యారు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు వెలుగులోకి రావడం టిడిపిలోనీ కొందరి నేతల సహకారంతో బీఫామ్ కూడా ఇచ్చేసారంటూ సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో పోలంరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి త్యాగాలు చేస్తూనే ఉండాలా అనే రాజకీయ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న వేమిరెడ్డి దంపతులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించి రాత్రికి రాత్రి తిరిగి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నే జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెడుతూ నామినేషన్ దాఖలు చేసేందుకు స్వయంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంకు వచ్చారు...
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. దీంతో జిల్లాలో మరోసారి వేమిరెడ్డి పొలిటికల్ పవర్ ఏంటో టిడిపి పార్టీలో వారికున్న పట్టు ఏంటో అర్థమవుతుంది...
మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.