నగరం ఎంపీటీసీ అభ్యర్థిగా మోర్ల స్వరూపరాణి నామినేషన్ దాఖలు
నగరం ఎంపీటీసీ అభ్యర్థిగా మోర్ల స్వరూపరాణి నామినేషన్ దాఖలు:
నగరం, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన నగరం ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీపీ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి కె. సత్యనారాయణకు శుక్రవారం అందజేశారు. అనంతరం స్వరూపరాణి మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్, కృష్ణ పశ్చిమ డెల్టా నీటి సంఘాల చైర్మన్ పంతాని మురళీధరరావు, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, మాజీ జడ్పిటిసి సభ్యులు మేకా శివరామకృష్ణ, మాన్యం నాగమణి, సంగం డైరీ డైరెక్టర్ ఎన్వికె ప్రసాద్, కూటమి పార్టీల నాయకులు లుక్కా గుడారంకయ్య, ఉప్పాల చెన్నకేశవులు, సమ్మెట శ్రీనివాసరావు, పీవీ చింతారావు, ఉదయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.