కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు
కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు: ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నెల్లూరు, మేజర్ న్యూస్ : అనేక డివిజన్ లలో విస్తృత ప్రచారం జోరు వర్షంలోనూ ఆత్మీయ సమావేశాల్లో కోటంరెడ్డి సుజిత, లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచార రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు. నామినేషన్ల ప్రారంభమైన దగ్గర నుంచి రూరల్ పరిధిలోని 36 డివిజన్ల పరిధిలో ఆత్మీయ సమావేశాల తేదీలను ఖరారు చేసి, ఒక్కో డివిజన్ లలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి తదితరులు ఇప్పటికే అనేక డివిజన్లో ఆత్మీయ సమావేశాలలో పాల్గొని అక్కడ స్థానికులతో మమేకమయ్యారు. గత రెండు సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వ హాయంలో రూరల్ నియోజకవర్గం లో జరిగిన 966 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను స్థానికులకు వివరిస్తున్నారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. స్థానికంగా ఇంకా ఏమైనా రోడ్లు, రహదారులు, కాలువలు అసంపూర్తిగా ఉన్నాయా స్థానికంగా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలతో కలిసిపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తో పాటు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతున్న ఇప్పటికే రూరల్ పరిధిలోని సగం డివిజన్లలో కోటంరెడ్డి కుటుంబం ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు.
మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.