BREAKING
సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా వైసిపి తరుపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి అల్లు విజయ ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీ ర్యాలీ చంద్రబాబుపై జగన్ ఫైర్ జోరువానలోనూ ఆగని వైఎస్సార్‌సీపీ ప్రచారం! స్టార్ హీరో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా నామినేషన్ల ప్రక్రియపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. చంద్రబాబు, ఎస్ఈసీపై విమర్శలు భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు, ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలంగాణలో భారీగా సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్‌.. విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ ఆకస్మిక సోదాలు మదన్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి చిలకలూరిపేటలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట బందోబస్తు నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: సీఐ రమేష్,ఎస్సై అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోటంరెడ్డి కుటుంబం దూకుడు ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా వత్సవాయి జడ్పీటీసీ అభ్యర్థిగా కిలారు విశ్వనాథ్ నామినేషన్.. టీడీపీలో గందరగోళం! జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చక్రం తిప్పిన వేమిరెడ్డి కుటుంబం..

ఇంకెన్నాళ్లీ పారిశ్రామిక ప్రమాదాలు? కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

Select Suryaa Now
ఇంకెన్నాళ్లీ పారిశ్రామిక ప్రమాదాలు?  కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

జిన్నారం: సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు విషాదం మరువకముందే.. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన పరిశ్రమల యాజమాన్యాలు.. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సరాక పరిశ్రమ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు యాజమాన్యంతో చర్చించి 70 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు అంత్యక్రియల కోసం లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఘటనలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత యాజమాన్యాన్ని ఆదేశించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యంతో పాటు వివిధ శాఖల అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటన పైన పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక శాసనసభ్యుడిగా కుటుంబాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..పారిశ్రామిక అభివృద్ధికి పటాన్చెరు ప్రాంతం కీలక కేంద్రంగా ఎదుగుతున్నప్పటికీ.. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం ఉత్పత్తి, లాభాల పెరుగుదల మాత్రమే కాదని.. అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి ప్రాణానికి భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయా? ప్రమాదాలను ముందుగానే గుర్తించే వ్యవస్థలు పనిచేస్తున్నాయా? గ్యాస్ లీకేజీలను నివారించే రక్షణ చర్యలు తీసుకుంటున్నారా? అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు ఉన్నాయా? అనే అంశాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలి

సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీకి దారితీసిన కారణాలను వెలికితీయాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. భద్రతా లోపాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

సిగాచి ఘటన నుంచి తగిన గుణపాఠాలు నేర్చుకుని కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, వరుస పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని విమర్శించారు.

కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జీఎంఆర్ హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.