BREAKING
మామిడికుదురు జడ్పీటీసీ గా గొల్లపల్లి అమూల్య ఉదయం వాక్‌లో ప్రజలతో మాట్లాడిన రమేష్ గౌడ్ - నగరంలోని హౌసింగ్ బోర్డ్ చిల్డ్రన్స్ పార్క్ లో వాకర్స్ తో మాటా మంతి - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ సాయిపేట–2 MPTC బరిలో జనసేన అభ్యర్థి డేగా కృష్ణ! 37వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి షేక్ రఫీ ఇంటింటి ప్రచారం యువతను ఆకట్టుకునేలా సరికొత్త ప్రేమకథా చిత్రంగా హైకూ.. సినిమా పూర్తి రివ్యూ! "స‌ర్వేపల్లి వైకాపాలోకి భారీగా కొనసాగుతున్న వలసలు" గొల్లపల్లి అమూల్య జడ్పీటీసీ గా నామినేషన్ బాక్సాఫీస్ వద్ద రణబీర్ రామాయణం జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఏడు కోట్లకు పైగా వసూళ్లు! ఆత్మకూరులో కీలక రాజకీయ పరిణామం.. టీడీపీలో చేరిన మేకపాటి కుటుంబీకులు! కల్కి రెండు సినిమాపై అంచనాలు పెంచేలా ప్రభాస్ పుట్టినరోజు ప్రత్యేక వీడియో విడుదల! టాంగ్ టా రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పతాకాల పంట దండిగుంట పంచాయతీ వైసీపీ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు.. ఫౌజీ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్! సరికొత్త హారర్ అనుభూతిని పంచిన 418 సినిమా రివ్యూ.. ప్రేక్షకులను భయపెట్టడంలో ఈ చిత్రం సఫలమైందా! సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకుడు పాటి ప్రసాద్ రెడ్డి

ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు: ఆంధ్రప్రదేశ్ (తూర్పు గోదావరి జిల్లా) పరిధిలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ప్రభాస్ అభిమానులు సేవా కార్యక్రమాలతో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభాస్ ఫ్యాన్ సిటీ ప్రెసిడెంట్ ఏలూరి దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భాగంగా పూజలు, అన్నదానం, విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ, వృద్ధులకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకు సిటిఆర్ఐ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, నటుడు ప్రభాస్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ప్రార్థించారు. అనంతరం స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘాన్ని సందర్శించి అక్కడి పిల్లలకు, పెద్దలకు అల్పాహారం పంపిణీ చేశారు. విద్యార్థులకు చదువులో ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో పిల్లలకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. అనంతరం సంఘం సభ్యులు, అభిమానులు, ప్రముఖుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ప్రభాస్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారితో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా వై దేవిప్రసాద్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడి పుట్టినరోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం విశేషంగా నిలిచిందన్నారు. అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని సామాజిక బాధ్యతగా మలుచుకుంటూ, చిన్నారులకు విద్యా సామగ్రి అందించడం, వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా అభిమానులు తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నామన్నారు. అభిమానం అంటే కేవలం అభిమాన నటుడి విజయాలను వేడుకగా జరుపుకోవడమే కాదు..

మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (తూర్పు గోదావరి జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.