ఉండవల్లిలో హైటెన్షన్ భేటీ.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కీలక సమావేశం నిర్వహించారు.
సుప్రీంకోర్టు తాజా తీర్పు, స్థానిక ఎన్నికల నిర్వహణపై త్వరలో రానున్న మార్గదర్శకాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రెబల్ అభ్యర్థుల బెడద నివారణపై ఇరు నేతలు మంతనాలు జరిపారు.
ఎన్నికల్లో సమన్వయ లోపం రాకుండా ఉండటానికి అనుసరించాల్సిన కార్యాచరణతో పాటు, క్షేత్రస్థాయిలో కూటమి విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన విధివిధానాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్లు సమాచారం.