BREAKING
టీడీపీ జెడ్పిటిసి అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి వెల్దుర్తి జెడ్పిటిసి అభ్యర్థిగా మోదిపల్లి శైలజ సుబ్బరాయుడు నామినేషన్ దాఖలు బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు -నామినేషన్లు అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి : ఎంపీ గురుమూర్తి వడ్ల ధర తగ్గింపుపై రైతుల ధర్నా బెజ్జుర్‌లో ఘనంగా స్వేరో డే వేడుకలు తూర్పు కంభంపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హాసాకొత్తూర్ లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర మోటార్స్ ప్రారంభం జనసేన పార్టీ ఏతురు ఎంపిటిసి అభ్యర్థిగా భారతమ్మ 37వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. ఎన్నికల ప్రచారంలో జోష్ మర్రిపూడి ఎంపీటీసీ బరిలో లక్ష్మీ సుప్రజ..! తూర్పు కంభం పాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు. ధర్మవరంలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచారం 11వ వార్డులో మాసపల్లి సాయి కుమార్ విస్తృత ప్రచారం కౌన్సిలర్ అభ్యర్థి మాసపల్లి సాయి కుమార్, చైర్మన్ అభ్యర్థి కాచెర్ల ఆంజనేయులును గెలిపించాలని విజ్ఞప్తి వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్. ఉండవల్లిలో హైటెన్షన్ భేటీ.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

నా పేరు వాడితే తాటతీస్తా.... ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Select Suryaa Now
నా పేరు వాడితే తాటతీస్తా.... ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

 

*నా పేరు ఎవరైనా వాడితే తాటతీస్తా* 

 *అర్హత ఉన్న వారికే ఉద్యోగాలు..* 

 *పైరవీలు, సిఫార్సులకు తావులేదు* 

 *షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హెచ్చరిక* 

 *అంగన్వాడీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత* 

అంగన్వాడీ పోస్టుల నియామకాల్లో తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. అంగన్వాడీ ఉద్యోగాల విషయంలో మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి ఎవరూ నష్టపోవద్దని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు అంగన్వాడీ పోస్టుల నియామకాలకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ పోస్టుల నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

పైరవీలు, సిఫార్సులకు తావులేదు

అంగన్వాడీ పోస్టుల భర్తీలో ఎవరి సిఫార్సులు, పైరవీలు పనిచేయవని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల అర్హత, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకాలు జరుగుతాయని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. తన పేరు చెప్పి లేదా తన పేరును ఉపయోగించుకొని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఆ విషయాన్ని వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తన పేరు దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని, అలాంటి వారి తాట తీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. అంగన్వాడీ పోస్టుల నియామకాల్లో ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. నియామక ప్రక్రియలో అనవసర జోక్యం చేసుకోవడం, అక్రమాలకు పాల్పడటం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా ఉద్యోగాలను కేటాయిస్తుందని, అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వీర్లపల్లి శంకర్ తెలిపారు.

జవాజి రాఘవేందర్ గౌడ్, మేజర్ న్యూస్ షాద్ నగర్