తూర్పు కంభం పాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు.
సూర్య న్యూస్ ముండ్లమూరు: మండలంలోని తూర్పు కంభంపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. హనుమంతరావు సోదరుడు చాగంటి రాంబాబు ఎంపీపీగా పనిచేశారు. చాగంటి హనుమంతరావు గత 20 సంవత్సరాల నుండి టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంపాడు గ్రామ అభివృద్ధిలో హనుమంతరావు క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా పలువురు టిడిపి నాయకులు అభినందనలు తెలిపారు.