BREAKING
అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

రైతుల సంక్షేమమే ధ్యేయం... -ఎమ్మెల్యే కవ్వంపల్లి

Select Suryaa Now
రైతుల సంక్షేమమే ధ్యేయం... -ఎమ్మెల్యే కవ్వంపల్లి

రైతుల సంక్షేమమే ధ్యేయం...
-ఎమ్మెల్యే కవ్వంపల్లి 
-బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
బెజ్జంకి/మేజర్ న్యూస్:
రైతుల అభివృద్ధికి మెరుగైన సేవలు అందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.బుధవారం బెజ్జంకిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి అయన హాజరయ్యారు.ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి కేడీసీసీ బ్యాంకు చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు,నూతన పాలకవర్గ సభ్యులు,మహిళలు ఘనస్వాగతం పలికారు.అక్కడి నుంచి భారీ ర్యాలీ మధ్య అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి,ఎడ్ల బండి చౌరస్తా వద్ద విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలవేసి మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు.నూతన ఏఎంసీ చైర్మన్ గా మాతంగి శిరీష,వైస్ చైర్మనుగా పర్శ సంతోష్,డైరెక్టర్లుగా జెల్ల రాజేశ్వరి,కుంట హరికృష్ణ,దేశరాజు అనిల్,నందికొండ తిరుపతి రెడ్డి,మైసంపల్లి తిరుపతి,ఇస్కిల్ల ఐలయ్య,జీల లింగం,రెడ్డి రామకృష్ణ రెడ్డి,ఎం.డి సాధిక్,ఎలకంటి శ్రీనివాస్ రెడ్డి,బోయినపల్లి కృష్ణారావు,గుండా వెంకట్ రెడ్డిలచే జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేపించారు.ఈ సందర్బంగా నూతన పాలకవర్గానికి పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా నూతన పాలకవర్గం సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు.దివంగత వైయస్సార్ రైతు పక్షపాతిగా పనిచేశారని ఆయన బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు వరిస్తాయన్నారు.పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్,ఏఎంసీ మాజీ చైర్మన్ పులి కృష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్  మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి అక్కరవేణి పోచయ్య,ఆయా మండలాల పీఏసీఎస్ చైర్మన్లు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.(సూర్య రిపోర్టర్,భాస్కర్)