BREAKING
బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!. థేల్స్ కంపెనీ సివిల్, మిలిటరీ రాడార్ వ్యవస్థల ఎంపిక పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం.. 8 వికెట్లతో గెలిచి ట్రై సిరీస్ ఫైనల్‌కు అర్హత అనకాపల్లి జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లేల సాయి కిరణ్. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చీడికాడ కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ఖతార్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ సద్భావన ప్రదర్శించాలి...ఖతార్ స్పష్టీకరణ విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నుంచి కోబలి ఫుల్ వీడియో సాంగ్ విడుదల అర్నబ్ తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత కోనసీమ ప్రజలకు అండగా ఉంటా 'ఆర్నబ్’ తుఫాన్ కు అనకాపల్లి జిల్లా పోలీస్ హై అలర్ట్ - సర్వసన్నద్ధం.

రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చాటిన ఆసిఫాబాద్ విద్యార్థినులు - జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చాటిన ఆసిఫాబాద్ విద్యార్థినులు - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ నెల 14 నుంచి 17 తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించి విజేతగా నిలువగా, ఇందులో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటారని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో విజేత క్రీడాకారిణులను సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాంపియన్షిప్ పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులో  టి.డబ్ల్యూ. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (బాలికలు), ఆసిఫాబాద్‌కు చెందిన 10 మంది క్రీడాకారిణులు ప్రాతినిధ్యం వహించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పోటీలలో క్రీడా పాఠశాల విద్యార్థినిలు 7 మంది ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. రాబోయే పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలలో విద్యార్థినులు సాధిస్తున్న విజయాలు పాఠశాలకు గర్వకారణమని, క్రమశిక్షణ, నిరంతర సాధన, కోచ్‌ల మార్గదర్శకత్వంతో మరిన్ని విజయాలు సాధించాలని, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో  డి.డి.టి.డబ్ల్యూ. అంబాజీ, పాఠశాల పిడి మీనా రెడ్డి, కోచ్ తిరుమల్, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.