BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన

Select Suryaa Now
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన
 
- అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచనలు
 
సూర్య, వేములవాడ:  
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ, ఆలయ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. 
 
పనులు వేగంగా పూర్తి చేసేందుకు కావలసిన సిబ్బందిని నియమించి పూర్తి చేయించాలని సూచించారు. 
పరిశీలనలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఈఈ ఆర్ అండ్ బీ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.