BREAKING
భవిష్యత్తులో ఆ దేశానికి ఇంధన ఇబ్బందులు తప్పవన్న మాస్కో గ్రీన్ వాషింగ్‌కు పాల్పడిన ఈ-కామర్స్ దిగ్గజం అలెగ్రోకు భారీ జరిమానా పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు జనరల్ క్విజ్ పోటీలు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా : ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు : పురపాలక సర్వసభ్య సమావేశంలో పథకం అమలుపై విస్తృత చర్చ. : తిరుపతి–రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి - ఎంపీ గురుమూర్తి చౌరస్తా పనులకు భూమిపూజ.. వాల్‌స్ట్రీట్‌లో ఆంథ్రోపిక్ ఐపీవో జోరు నియోక్లౌడ్ సంస్థలపై వస్తున్న ఆందోళనలను తోసిపుచ్చిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రొద్దుటూరలో 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ టెన్సెంట్ క్యూ3 ఫలితాలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా - పురపాలక సర్వసభ్య సమావేశంలో పథకం అమలుపై విస్తృత చర్చ గత రెండు ఆర్థిక బుడగలు ఏఐ బూమ్‌కు ఎలా అద్దం పడుతున్నాయి? ఉద్యానవన పంటలతో పాటు ఆధారిత ఉత్పత్తులపై రైతుల దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అమెరికా శక్తి ఎగుమతులు గరిష్ట స్థాయికి చేరాయా?

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా - పురపాలక సర్వసభ్య సమావేశంలో పథకం అమలుపై విస్తృత చర్చ

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా - పురపాలక సర్వసభ్య సమావేశంలో పథకం అమలుపై విస్తృత చర్చ
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి: నిర్మల్ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” అమలుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఈ సార్వత్రిక జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని స్థానిక కౌన్సిలర్లు వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తు ప్రక్రియలో సహకరించాలని సూచించారు.కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా పరిగణించనున్న నేపథ్యంలో, వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని, సంబంధిత నిబంధనలను పరిశీలించిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని సూచించారు.ఈ నెల 19వ తేదీ నుంచి పథకం అమలులోకి రానున్నందున కౌన్సిలర్లు ప్రజలకు, సంబంధిత అధికారులకు అందుబాటులో ఉండి పథకం విజయవంతంగా అమలయ్యేలా కృషి చేయాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించే దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ఎం. రవి బాబు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.