BREAKING
విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట - మంత్రి పొంగులేటి. ఉక్రెయిన్‌కు ఈయూ భారీ ఆర్థిక సాయం కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల ఆయుష్మాన్ భారత్ చికిత్స ప్యాకేజీల పెంపు.. నాసా వాయేజర్-1 అద్భుతమైన మైలురాయి తిర్యాణిలో 20 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత మెెలంచన్ గెలిచే అవకాశం గంభీరావుపేటలో 19 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి టాలీవుడ్ నటుడు బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో కోర్టు కీలక తీర్పు దృశ్యాల నిధిగా ఈ ఏడాది జ్ఞాపకాలు హోవార్డ్ లుట్నిక్ పై అమెరికా డెమొక్రాట్ల విచారణ ఓటీటీలో దూసుకుపోతున్న ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'.. డిజిటల్ వేదికగా ట్రెండింగ్‌లో నిలిచిన సినిమా భవిష్యత్తులో ఆ దేశానికి ఇంధన ఇబ్బందులు తప్పవన్న మాస్కో గ్రీన్ వాషింగ్‌కు పాల్పడిన ఈ-కామర్స్ దిగ్గజం అలెగ్రోకు భారీ జరిమానా

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా : ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు : పురపాలక సర్వసభ్య సమావేశంలో పథకం అమలుపై విస్తృత చర్చ. :

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా : ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు : పురపాలక సర్వసభ్య సమావేశంలో పథకం అమలుపై విస్తృత చర్చ. :

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి.
నిర్మల్ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” అమలుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఈ సార్వత్రిక జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని స్థానిక కౌన్సిలర్లు వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తు ప్రక్రియలో సహకరించాలని సూచించారు.

కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా పరిగణించనున్న నేపథ్యంలో, వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని, సంబంధిత నిబంధనలను పరిశీలించిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని సూచించారు.

ఈ నెల 19వ తేదీ నుంచి పథకం అమలులోకి రానున్నందున కౌన్సిలర్లు ప్రజలకు, సంబంధిత అధికారులకు అందుబాటులో ఉండి పథకం విజయవంతంగా అమలయ్యేలా కృషి చేయాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించే దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ఎం. రవి బాబు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.