telangana
తిర్యాణిలో 20 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ
సూర్య తిర్యాణి : తిర్యాణి, గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నూతనంగా మంజూరైన పింఛను పత్రాలను 20 మంది లబ్ధిదారులకు సర్పంచ్ మాడవి రాజేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు పింఛన్లు నెలవారీ ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు.వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు అందే పింఛను వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి తోడ్పడుతుందని రాజేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామంలోని ప్రతి అర్హుడికీ చేరేలా కృషి చేస్తామని తెలిపారు.పింఛనుకు అర్హత ఉండి ఇంకా మంజూరు కానివారు తమ వివరాలను గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేసి, అర్హత మేరకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ చేని కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.