BREAKING
ఎస్ ఆర్ బాలికకు జాతీయ స్థాయిలో ఘనత భారత్-జపాన్ మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష షెన్‌జెన్ చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మ్యాజికల్ కాంబో రిపీట్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో భరత్ బాలా ‘బనారస్’ మూవీ దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి…మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కలమట మద్దతుతో రాజారావు మాస్టారు నామినేషన్ కు భారీ జన సముద్రం. కళ్యాణదుర్గం పట్టణంలో మారంపల్లి కాలనీలో ప్రారంభానికి సిద్ధమైన వాటర్ ప్లాంట్. 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా ? బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య వాతావరణ న్యాయం, సమానత్వం మరియు ఆర్థిక నిధులపై స్పష్టమైన డిమాండ్ రూ. 7,842కి పడిపోయిన క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత శాశ్వతం కావాలి.. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు ఐదు ప్రముఖ సిరీస్‌ల నామినేషన్లు భారతీయ చిత్రాలతో పాటు పర్యావరణ హిత చిత్రాలకు పెద్దపీట స్కాచ్ విస్కీ దిగుమతులపై టారిఫ్ వివాదం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంః మంత్రి వాకిటి శ్రీహరి

Select Suryaa Now
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంః మంత్రి వాకిటి శ్రీహరి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు సంబంధించిన లోగో, మస్కట్, బ్రోచర్‌ను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఖమ్మం జిల్లా మధిరలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
క్రీడలు కేవలం పతకాల సాధనకే పరిమితం కావని, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువత చదువులతోపాటు క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 విజయవంతానికి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత, ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.