కళ్యాణదుర్గం పట్టణంలో మారంపల్లి కాలనీలో ప్రారంభానికి సిద్ధమైన వాటర్ ప్లాంట్.
కళ్యాణదుర్గం: పట్టణంలోని మారేంపల్లి కాలనీలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో శుద్ధజల వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించి ప్రారంభానికి సిద్ధం చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మూతపడిన శుద్ధజల ప్లాంట్‌కు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో మళ్లీ పునర్జీవం లభించింది. మరికాసేపట్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేతుల మీదుగా ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. మారేంపల్లి కాలనీ ప్రజలు స్వచ్ఛమైన తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ తన సొంత నిధులతో శుద్ధజల ప్లాంట్‌ను ఏర్పాటు చేయించినట్లు 8వ వార్డు కౌన్సిలర్ కొండోజి సునీత సంగప్ప, 9వ వార్డు కౌన్సిలర్ వనం అమృత తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమని భావించి ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వాటర్ ప్లాంట్ ప్రారంభంతో కాలనీ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించనుందని తెలిపారు. ప్రజా అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు.