BREAKING
మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం.. మెటా భారీ పందెం...మ్యూజ్ ఏఐ ఏజెంట్ రంగప్రవేశం శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ఉత్సాహంగా క్విజ్ పోటీలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి:గ్రంథాలయ అధికారి ఎన్. శ్రీనివాసులు తెలంగాణ ఇచ్చిన చరిత్రను కేటీఆర్ మరిచిపోయారా? డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అమెరికా కాంగ్రెస్‌లో కీలక శక్తి అనుమతుల సంస్కరణ బిల్లు పొగాకు పంపిణీ గుత్తపతకం రద్దుకు ప్రణాళికలు ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ గ్లోబల్ సిమెంట్ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాల కోతకు తీవ్ర కసరత్తు

19 నుంచి చేయూత పెన్షన్ డబ్బులు నేరుగా ఖాతాలోకి .. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యే మేడిపల్లి

Select Suryaa Now
19 నుంచి చేయూత పెన్షన్ డబ్బులు నేరుగా ఖాతాలోకి .. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యే మేడిపల్లి

సూర్య బోయినపల్లి మండలంలోని 567మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.ముందుగా జయ జయహే తెలంగాణ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ పథకాలు, చేయూత పెన్షన్ మంజూరుపై పాటల ద్వారా వివరించారు.బోయినపల్లి మండలంలోని 567మంది లబ్ధిదారులకు బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. చేయూత పెన్షన్ కోసం ఇప్పటికే దరఖాస్తుదారులు స్వీకరించామని తెలిపారు. అర్హుల ఎంపిక కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయించామని పేర్కొన్నారు. 19వ తేదీన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. జిల్లా మొత్తం 8,209, బోయినపల్లి మండలంలో 567 నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయడంలో బోయినపల్లి మండలంలో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.ఐదు లక్షల విలువైన బీమా వర్తిస్తుందని,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నెల రోజుల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారు లేనివారు సైతం అర్హులని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు ఇవ్వాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక పథకాలు అభివృద్ధి అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా దాదాపు ఐదు లక్షల చేయూత పెన్షన్లు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని, రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే నూతన రేషన్ కార్డులు అందిస్తున్నామని, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయిస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు. మండలంలో ఇందిరమ్మ ఇల్లు శరవేగంగా పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. మండలంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. 12 కోట్లతో స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నామని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శరత్ బాబు, ఎంఆర్ఓ షరీఫుద్దీన్ , ఎంపీడీఓ శ్రీధర్,  ఏఓ ప్రణీత, ఆర్ఐ మనోజ్, సూపీరియెండెంట్  వెంకటరమణ, పీఏసీఎస్ చైర్మన్లు, వెంకట రామారావు, దుర్గారెడ్డి, వన్నెల మమత రమణరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,స్థానిక  కార్యదర్శు మల్లేశం,గ్రామాల కార్యదర్శులు ,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజేశం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, బీసీ సెస్ చైర్మన్ కూసా రవి తదితరులు పాల్గొన్నారు