BREAKING
మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం.. మెటా భారీ పందెం...మ్యూజ్ ఏఐ ఏజెంట్ రంగప్రవేశం శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ఉత్సాహంగా క్విజ్ పోటీలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి:గ్రంథాలయ అధికారి ఎన్. శ్రీనివాసులు తెలంగాణ ఇచ్చిన చరిత్రను కేటీఆర్ మరిచిపోయారా? డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అమెరికా కాంగ్రెస్‌లో కీలక శక్తి అనుమతుల సంస్కరణ బిల్లు పొగాకు పంపిణీ గుత్తపతకం రద్దుకు ప్రణాళికలు ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ గ్లోబల్ సిమెంట్ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాల కోతకు తీవ్ర కసరత్తు

ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్

Select Suryaa Now
ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః టీజీఎస్ ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సంజయ్ జాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ సంస్థ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, సంస్థను ఆర్థికంగా, పరిపాలనాపరంగా మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.
ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడం, ప్రయాణికులకు నాణ్యమైన రవాణా సౌకర్యాలు అందించడం, సంస్థ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలను విస్తరించడంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.