శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు
మున్సిపల్ ఎన్నికల బరిలో సీపీఎం అభ్యర్థులు.
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో పార్టీ తరఫున దాఖలు చేసిన నాలుగు నామినేషన్లూ ఆమోదం పొందడంతో అభ్యర్థుల పోటీ ఖరారైంది. 5వ వార్డు నుంచి వెలివేంద్రం, 9వ వార్డు నుంచి డి.భారతి, 17వ వార్డు నుంచి ఉస్మాన్ బాషా, 37వ వార్డు నుంచి అంగేరి పుల్లయ్య బరిలో నిలిచారు. వీరిలో అంగేరి పుల్లయ్య మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం సుందరయ్య భవన్లో సీపీఎం నాయకులు సమావేశమై ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చించారు. తొలితరం సీపీఎం నాయకుడు పసుపులేటి వెంకటప్పయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఉద్యమకారులుగా బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. పదవులు, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాడే సీపీఎం అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య, బోనుపల్లి ఎంపీటీసీ చాముండేశ్వరి, గురునాథం, రాజా తదితరులు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి