BREAKING
వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి - అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: కిమిడి (తెలుగు, తమిళ, కన్నడల్లో సుస్వరాలు సృష్టించిన వాగ్గేయకారుని జీవిత చరిత్ర ఇది ) ఇథియోపియా, ఎరిట్రియా సరిహద్దులో భారీగా మోహరించిన సైన్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా - అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ ఒకే ఏడాది రెండు సినిమాల్లో జోడిగా నటిస్తున్న యువ నూతన నటీనటులు.. నవంబర్ 20న ‘డియర్ ఆస్ట్రోనాట్’ విడుదల ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ‘ఎఫ్.ఎఫ్.ఎస్’ యాప్: ఏడీఏ మోహనరావు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ని మర్యాద పూర్వకంగా కలిసిన 43 వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన ఎస్.ఏ.టి. రాజేష్ పెండింగ్ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి - అదనపు కలెక్టర్ వి. రాములు మాజీ మంత్రి శిద్దా రాఘవ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన చీమకుర్తి మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికైన శిద్దా సుధాకర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న యాంకర్ మంజూష గ్లామర్ ఫోటోషూట్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ వరుస ప్రమాదాల నేపథ్యంలో హ్యాంగ్ గ్లైడింగ్ క్రీడలపై తాత్కాలిక నిషేధం ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం 'ఎంజీ' జాతీయీకరణ ప్రతిపాదన తిరస్కరణ చట్టాలపై అవగాహన మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు

ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం

Select Suryaa Now
ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం

గుంటూరు, మేజర్‌న్యూస్‌ 

: ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు కావడానికి డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం ఉంటుందని గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఇ.ఆర్.ఓ మరియు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయిలో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులన్నారు. భారత ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానిక నివాసం ఉన్నప్పుడు మాత్రమే ఓటరుగా అర్హులుగా పరిగణింపడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2026 నవంబరు 1వ తేదీకి ముందు ఆరు సంవత్సరాల నుండి వృత్తిలో కొనసాగాలని అందులో కనీసం మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, ఆపై స్థాయిలో బోధన అనుభవం ఉండాలని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అర్హత కలిగి ఉంటారని, వారికి జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ), కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ నిర్ధారణ చేయాలని వివరించారు. ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చని లేదా ఫారం 19 పూర్తి చేసి ఏ.ఈ.ఆర్.వోలు ఉన్న స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 15 వేల దరఖాస్తులు అందాయని,  మొత్తం 19 వేల వరకు పనిచేస్తున్నట్లు అంచనా ఉందని చెప్పారు.

ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కె.కె.గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సి.పి.ఐ (ఎం) ప్రతినిధి కృష్ణకాంత్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, జన సేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.