బుడంపాడు కాల్వలో మహిళ మృత దేహం కలకలం
గుంటూరు : బుడంపాడు కాల్వలో మహిళ మృతదేహం బుధవారం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వెలికి తీశారు. ఈ నెల 17వ తేదీన మహిళ అదృశ్యమైనట్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మృతురాలు ఝాన్సీ లక్ష్మి(55)గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కే నాగరాజు గుంటూరు క్రైమ్