BREAKING
మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.3 వేల జరిమానా,ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందించాలి - కలెక్టర్ రాజర్షి షా రైతుల కోసమే పొలం పిలుస్తోంది కార్యక్రమాలు రిటైల్ దిగ్గజం టార్గెట్ జోరు టీఎన్జీవోలో 60 మంది ఉద్యోగుల సభ్యత్వ నమోదు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలి : ఏడిఏ మోహనరావు 12వ డివిజన్‌లో పారిశుధ్య సిబ్బందిని పెంచాలని అధికారులకు కార్పొరేటర్ కస్తూరి నాగరాజు విజ్ఞప్తి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి - మంత్రి గడ్డం వివేకానంద ఇటలీలో పిల్లలకు సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు 10+2 విధానానికి స్వాగతం - డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు గాజా యుద్ధాన్ని ఆపడంలో ఇజ్రాయెల్, హమాస్‌ల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి - అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: కిమిడి (తెలుగు, తమిళ, కన్నడల్లో సుస్వరాలు సృష్టించిన వాగ్గేయకారుని జీవిత చరిత్ర ఇది ) ఇథియోపియా, ఎరిట్రియా సరిహద్దులో భారీగా మోహరించిన సైన్యం

చట్టాలపై అవగాహన

Select Suryaa Now
చట్టాలపై అవగాహన

విద్యార్థులకు పోక్సో చట్టం, శక్తి యాప్‌పై న్యాయ అవగాహన సదస్సు.

 శ్రీకాళహస్తి పట్టణం విక్రమ్ హైస్కూల్‌లో బుధవారం విద్యార్థినీ విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, ప్రజ్ఞశ్రీ, శ్రీరామ్ పాల్గొని పోక్సో (POCSO) చట్టం, శక్తి యాప్ వినియోగం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్నతనం నుంచే చట్టాలపై కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. పోక్సో చట్టం ప్రాముఖ్యతను, బాలల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మత్తు పదార్థాలకు బానిసలవుతూ యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, లక్ష్యసాధనతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా బాలలకు ఎలాంటి ప్రమాదం జరిగినా, హింస లేదా వేధింపులకు గురైనా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు (PLVs), పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. VC venkataiah సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి