telangana
టీఎన్జీవోలో 60 మంది ఉద్యోగుల సభ్యత్వ నమోదు
సూర్య మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 60 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మిగిలిన అన్ని యూనిట్లలోనూ త్వరలో సభ్యత్వ నమోదు పూర్తి చేసి, రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు.అన్ని రంగాల్లో మంచిర్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షుడు ప్రకాష్‌తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.