BREAKING
కౌమార బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఆలయంలో నాగమల్లి మొక్క నాటిన మాజీ సర్పంచ్ చిందం రమేష్ 'భారత్ 2047' థీమ్‌తో ఫికీ వార్షిక సదస్సు వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ‘వ్యూ’ మూవీ.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక, నవంబర్ 20న థియేటర్లలో విడుదల పెద్దమ్మ తల్లి పంచరాత్రోత్సవాలకు గవర్నర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆహ్వానం బాల్య వివాహాల నివారణ అందరి ఉమ్మడి బాధ్యత: డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ వర్సిటీల కేంద్రంగా సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటుకు మన్‌సుఖ్ మాండవ్య పిలుపు భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ రామేశ్వర్ పల్లి గ్రామంలో చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీ ఆరోగ్య పరిశోధన రంగంలో మైలురాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌటాలలో ఘనంగా స్వాగత వేడుకలు ఎస్ అండ్ పీ 500 సూచీపై యూబీఎస్ అంచనా అభివృద్ధి చెందిన దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్య లోటు ప్రముఖ గాయిని భూదేవి తల్లికి దక్కిన గొప్ప గౌరవం : ఊటుకూరు లక్ష్మమ్మకు విశిష్ట మాతృమూర్తి పురస్కారం చింతకుంటలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  పర్యటన - ఆగిపోయిన "విఓ" భవనానికి మోక్షం

ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా: జేసి అశుతోష్ శ్రీవాస్తవ

Select Suryaa Now
ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా: జేసి అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు : పట్టణ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా లేదా కనీసం వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ, పొన్నూరు పురపాలక సంఘంలో నామినేషన్ల స్క్రూటీని పూర్తి జరిగిందని, గురువారం ఉపసంహరణలు ఉంటాయన్నారు. ఉపసంహరణలు అనంతరం తుది జాబితా ప్రకటన జరుగుతుందన్నారు. ఈ నెల 26న పోలింగ్, 30న లెక్కింపు జరుగుతుందన్నారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ ఎన్నికలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.పొన్నూరు పురపాలక సంఘం ఎన్నికలకు పొన్నూరులో గల సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ, మూడవ దశలలో నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. తెనాలి రెవెన్యూ డివిజన్ లో గల చేబ్రోలు, పొన్నూరు, తెనాలి, కొల్లిపర మండలాలు., గుంటూరు రెవెన్యూ డివిజన్ లో గల పెదకాకాని మండలంలో రెండవ విడతలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ లో గల మేడికొండూరు, ఫిరంగిపురం, గుంటూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాలు., తెనాలి రెవెన్యూ డివిజన్ లో గల కాకుమాను, దుగ్గిరాల మండలాల్లో మూడవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండవ దశ పోలింగ్ 29న, మూడవ దశ పోలింగ్ డిసెంబరు 2వ తేదీన జరుగుతాయన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అన్ని బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కె.కె.గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సి.పి.ఐ (ఎం) ప్రతినిధి కృష్ణకాంత్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, జన సేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.

సూర్య నాయక్