BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌటాలలో ఘనంగా స్వాగత వేడుకలు ఎస్ అండ్ పీ 500 సూచీపై యూబీఎస్ అంచనా అభివృద్ధి చెందిన దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్య లోటు ప్రముఖ గాయిని భూదేవి తల్లికి దక్కిన గొప్ప గౌరవం : ఊటుకూరు లక్ష్మమ్మకు విశిష్ట మాతృమూర్తి పురస్కారం చింతకుంటలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  పర్యటన - ఆగిపోయిన "విఓ" భవనానికి మోక్షం కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలు వేలం, కర్ణాటక మద్యం నాటుసార ధ్వంసం. సంపూర్ణ విజ్ఞానానికి గ్రంధాలయాలు దోహదం : ప్రధాన శాఖ గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు రబీలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత.. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త  మధు డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ లగ్జరీ గూడ్స్ మార్కెట్‌లో కోలుకుంటున్న వృద్ధి కొత్తగూడలో బోరుబావికి మరమ్మతులు అమెరికా కంపెనీలకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక గుడుంబాపై ఎక్సైజ్ అధికారుల దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం మెటా 'మ్యూజ్' ఏఐ ఏజెంట్‌పై భద్రతా నీలి నీడలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా: జేసి అశుతోష్ శ్రీవాస్తవ

రైతుల కోసమే పొలం పిలుస్తోంది కార్యక్రమాలు

Select Suryaa Now
రైతుల కోసమే పొలం పిలుస్తోంది కార్యక్రమాలు

గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:

గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరు మరియు లింగాయపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు  మోహనరావు (రెగ్యులర్), గుంటూరు మండల వ్యవసాయ అధికారి  బుల్లా కిషోర్ పాల్గొని రైతులకు పలు వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించారు.
 సందర్భంగా ముఖ్యంగా ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానం గురించి వివరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగి, అర్హులైన రైతులకు ఎరువులు సక్రమంగా అందుతాయని  అన్నారు. కేత్ బచావో అభియాన్ లో భాగంగా భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, పొలం సంరక్షణ, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, తెగుళ్లు  పంట రోగాలను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం, సేంద్రియ మరియు జీవ ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అంశాలపై రైతులకు సూచనలు చేశారు. అలాగే రబీ 2026 సీజన్‌లో శనగ, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసే రైతులు పంటల భీమా నమోదు చేసుకోవాలని, రైతులు చెల్లించాల్సిన ప్రీమియం తక్కువగా ఉన్నందున సమీప CSC కేంద్రాల ద్వారా నిర్ణీత గడువులోపు బీమా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఆనంద్ బాబు, గ్రామ ఆదర్శ రైతులు  రైతులు పాల్గొన్నారు.

ఆళ్ల వీరభద్రరావు, గుంటూరు