BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌటాలలో ఘనంగా స్వాగత వేడుకలు ఎస్ అండ్ పీ 500 సూచీపై యూబీఎస్ అంచనా అభివృద్ధి చెందిన దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్య లోటు ప్రముఖ గాయిని భూదేవి తల్లికి దక్కిన గొప్ప గౌరవం : ఊటుకూరు లక్ష్మమ్మకు విశిష్ట మాతృమూర్తి పురస్కారం చింతకుంటలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  పర్యటన - ఆగిపోయిన "విఓ" భవనానికి మోక్షం కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలు వేలం, కర్ణాటక మద్యం నాటుసార ధ్వంసం. సంపూర్ణ విజ్ఞానానికి గ్రంధాలయాలు దోహదం : ప్రధాన శాఖ గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు రబీలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత.. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త  మధు డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ లగ్జరీ గూడ్స్ మార్కెట్‌లో కోలుకుంటున్న వృద్ధి కొత్తగూడలో బోరుబావికి మరమ్మతులు అమెరికా కంపెనీలకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక గుడుంబాపై ఎక్సైజ్ అధికారుల దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం మెటా 'మ్యూజ్' ఏఐ ఏజెంట్‌పై భద్రతా నీలి నీడలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా: జేసి అశుతోష్ శ్రీవాస్తవ

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి - మంత్రి గడ్డం వివేకానంద

Select Suryaa Now
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి - మంత్రి గడ్డం వివేకానంద
సూర్య మంచిర్యాల: విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, పట్టుదల,కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగారాలు,గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యా ప్రమాణాలు,హాజరు శాతం,ఏకాగ్రత పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.బుధవారం కోటపల్లి మండలంలోని మోడల్ స్కూల్‌లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద,మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు.ఉదయం అల్పాహారం తీసుకోకుండా పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుండగా,మంచిర్యాల జిల్లాలో 35 వేల మంది,చెన్నూర్ నియోజకవర్గంలో 12 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు.పౌష్టికాహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా చదువుకోవడంతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని అన్నారు.కోటపల్లి మోడల్ స్కూల్‌లో 301 మంది బాలురు, 237 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాలనే లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు.వ్యక్తిత్వ వికాసం,నాయకత్వ లక్షణాలు, మంచి నడవడికను పాఠశాల స్థాయి నుంచే అలవర్చుకోవాలన్నారు.విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో పాటు డిస్టింక్షన్ సాధిస్తే పాఠశాలకు ప్రత్యేక బహుమతి అందజేస్తానని ప్రకటించారు.మోడల్ స్కూల్‌లో సుమారు 500 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా భోజనశాల నిర్మాణానికి రూ.40 లక్షలు అవసరమని,ఇందులో రూ.20 లక్షలు జిల్లా కలెక్టర్ ద్వారా,మరో రూ.20 లక్షలు డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి కేటాయించనున్నట్లు వెల్లడించారు.చెన్నూర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, డిగ్రీ కళాశాలకు రూ.2 కోట్లు, ఇంటర్మీడియట్ కళాశాలకు రూ.1.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.కోటపల్లిలో రూ.90 లక్షలతో ఎస్సీ వసతి గృహ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.సోమనపల్లిలో 2,500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్ల వ్యయంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని, వీటి ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని వివరించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.పాఠశాలల్లో తాగునీరు,మరమ్మతులు, బోర్‌వెల్స్,ఇతర సదుపాయాలకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు.విద్యార్థులకు అల్పాహారం,మధ్యాహ్న భోజనం,డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 75 శాతానికి పైగా ఉన్న విద్యార్థుల హాజరు శాతం ఈ పథకాలతో మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం మంత్రి,కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించి ఆహార నాణ్యత,మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ గదిని ప్రారంభించారు.అనంతరం చెన్నూర్ మండలం కన్నేపల్లి నుంచి సంకారం వరకు రూ.90 లక్షల ఎంఆర్‌ఆర్ 2024-25 నిధులతో పునరుద్ధరించిన బీటీ రహదారిని ప్రారంభించారు.సంకారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బెంచీలు అందజేశారు.పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన వసతులు సమకూర్చాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.